![]() |
![]() |

బిగ్ బాస్ సీజన్-9 రెండు వారాల దాకా ఒక లెక్క.. మూడో వారం నుండి ఒక లెక్క అన్నట్టుగా సాగుతుంది. దానికి కారణం కామనర్స్ కోటాలో హౌస్ లోకి వచ్చిన దివ్య నిఖిత. తను వచ్చీ రాగానే దమ్ము శ్రీజ, ప్రియా శెట్టిలకి ఇచ్చిపడేసింది.
తాజాగా విడుదలైన బిగ్ బాస్ సీజన్-9 తెలుగు(Bigg Boss 9 Telugu)ప్రోమోలో.. హౌస్‌లో ఉన్న వాళ్ల పర్ఫామెన్స్‌ని బట్టి వారి స్థానాలను కేటాయించమన్నాడు బిగ్ బాస్. దాంతో దివ్య నిఖిత ఒక్కొక్కరి గురించి చెప్తూ కెప్టెన్సీ టాస్క్‌ని మరింత ఆసక్తికరంగా మార్చేసింది. హౌస్‌లో ఉన్న పదమూడు(13) మంది కంటెస్టెంట్స్‌కి వారి వారి పర్ఫామెన్స్ చెప్తూ తను ఇచ్చిన ర్యాకింగ్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. హౌస్ లో ఫ్లోరా సైనీకి చివరి స్థానం ఇచ్చిన దివ్య.. మీరు గేమ్‌లో యాక్టివ్‌గా లేరని చెప్పింది. రాము రాథోడ్‌కి పన్నెండవ స్థానం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ పడాలకి పదకొండవ స్థానం ఇచ్చింది. ఇక దమ్ము శ్రీజకి పదో స్థానం ఇచ్చింది. దమ్ము శ్రీజని దుమ్ముదులిపేసింది దివ్య. నువ్వు గొడవని పెంచడానికే ట్రై చేస్తావ్ తప్ప.. దానికో సొల్యూషన్ కోసం కాదు. ఒకరిపై రాయి వేసేసి.. సైలెంట్‌గా ఉండు అంటే ఉంటారా.. నీ ఎక్స్ ప్రెషన్స్ కూడా నచ్చవు.. నీ బిహేవియర్ ఎలా ఉంటుందంటే.. ఒక్క లుక్‌తోనే యాటిట్యూడ్ చూపిస్తావ్. నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్టుగా చూస్తావంటూ దమ్ము శ్రీజ దుమ్ముదులిపింది దివ్య.
మాస్క్‌మెన్‌కి తొమ్మిదో నెంబర్ ఇవ్వడంతో అతని వాదన స్టార్ట్ చేశాడు. గాయపడ్డ పులి అంటూ తనకి తానే లేపుకున్నాడు. ఇక సంజన వైపు చూస్తూ.. ఇదే స్మైల్‌తో నొప్పి తెలియకుండా సూది గుచ్చేస్తారని సెటైర్ వేసింది దివ్య. భరణికి నెంబర్ వన్ స్థానం ఇచ్చిన దివ్య.. అందరికంటే మీరు స్మాట్ అని చెప్పింది.
![]() |
![]() |